Andhra Pradesh : నేడు ఏపీలో ఓట్ల లెక్కింపు
ఆంధ్రప్రదేశ్ లో టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ లో టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరగనుంది. కాకినాడ జేఎన్టీయూలో ఈ ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 5వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలో 16,737 మంది ఓట్లు ఉండగా, 15,490 ఓట్లు పోలయ్యాయి.
బరిలో ఐదుగురు...
ఈ ఎన్నికల్లో మొత్తం ఐదుగురు అభ్యర్థులు పోటీ చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా కాకినాడ జేఎన్టీయూ దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పాస్ లు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో స్పష్టమైన మెజారిటీ రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతుంది. లెక్కింపు కేంద్రం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.