Breaking: వైఎస్ వివేకా హత్యపై సంచలన తీర్పు... దాని విషయం మాట్లాడారంటే?

వైఎస్ వివేకా హత్యపై న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించ వద్దంటూ ఆదేశాలు జారీ చేసింది

Update: 2024-04-18 12:33 GMT

వైఎస్ వివేకా హత్యపై న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకా హత్యను ప్రస్తావించ వద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. తమ పార్టీ నేతలను ఇరుకున పెట్టే విధంగా ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకా హత్యను ప్రస్తావిస్తున్నారని వైసీపీ నేత సురేష‌ బాబు కడప న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనివల్ల ప్రజలు అయోమయానికి గురయ్యే అవకాశముందని పేర్కొంది.

ఎన్నికల ప్రచారంలో....
దీంతో కడప న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ వివేకా హత్య కేసును ఎట్టిపరిస్థితుల్లో ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించవద్దని తెలిపింది. టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ నేత పురంద్రీశ్వరి, జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ తో పాటు నారా లోకేష్, వైఎస్ షర్మిల, వైఎస్ సునీతకు కూడా ఈ ఆధేశాలు జారీ చేసింది. ఎవరూ దీని గురించి మాట్లాడవద్దని కడప న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.


Tags:    

Similar News