Attack On Ys Jagan : ఒకటి కాదు.. రెండుసార్లు సతీష్ జగన్ పై దాడి చేశాడు
వైసీపీ అధినేత జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కు న్యాయస్థానం పథ్నాలురు రోజులు రిమాండ్ కు విధించింది.
వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కు న్యాయస్థానం పథ్నాలురు రోజులు రిమాండ్ కు విధించింది. అయితే రిమాండ్ రిపోర్టులో అనేక కీలక విషయాలను పోలీసులు ప్రస్తావించారు. జగన్ ను హత్య చేసేందుకు సతీష్ ఈ రాయిదాడి చేశారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అందుకు రాయిని వినియోగించారు. రెండుసార్లు నిందితుడు సతీష్ దాడికి ప్రయత్నించారని పోలీసులు పేర్కొన్నారు. తొలి సారి డాబా కొట్ల సెంటర్ లో జగన్ ప్రయాణిస్తున్న వాహనంపై రాయి విసరగా అది తగలలేదు.
పట్టుకున్నప్పటికీ...
ఆ తర్వాత వివేకానంద స్కూల్ సమీపానికి వచ్చి రాయి దాడికి పాల్పడ్డారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. రెండోసారి రాయి బలంగా జగన్ నుదుటి భాగంపై తగిలిందని పోలీసులు తెలిపారు. దీంతో పాటు కావాలనే సతీష్ ఈ రాయి దాడి చేసి నట్లు తమ విచారణలో వెల్లడయిందని, సతీష్ రాయి దాడి చేస్తుండటం చూసి కొందరు పట్టుకునే ప్రయత్నించగా వారిని తప్పించుకుని పారిపోయిన విషయాన్ని కూడా పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీలలో కూడా అది లభ్యమయిందని అందులో తెలిపారు.