రేపల్లె రైల్వే స్టేషన్ సామూహిక అత్యాచారం కేసులో కోర్టు సంచ‌ల‌న తీర్పు

గత సంవత్సరం బాపట్ల జిల్లాలో సంచలనం సృష్టించిన రేపల్లె రైల్వే స్టేషన్ లో జరిగిన;

Update: 2023-08-09 15:44 GMT
రేపల్లె రైల్వే స్టేషన్ సామూహిక అత్యాచారం కేసులో కోర్టు సంచ‌ల‌న తీర్పు
  • whatsapp icon

గత సంవత్సరం బాపట్ల జిల్లాలో సంచలనం సృష్టించిన రేపల్లె రైల్వే స్టేషన్ లో జరిగిన సామూహిక అత్యాచార ఘటన కేసులో న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. నిందితులు పాలుబొయిన విజయకృష్ణ, పాలుచురి నిఖిల్ ల‌కు 20 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ ఫోర్త్‌ అడిషనల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ కోర్ట్ తీర్పు వెలువరించింది. నేరం జరిగిన సంవత్సరంలోపే నేరస్తులకు జైలు శిక్ష పడేవిధంగా జిల్లా పోలీస్ అధికారులు చర్యలు తీసుకున్నారు. అత్యాచార ఘటన జరిగిన 15 రోజులలోనే విచారణ ముగించిన పోలీసులు కోర్ట్ లో అభియోగపత్రం దాఖలు చేశారు.

తీర్పుపై డీజీపీ మాట్లాడుతూ.. కేసు ట్రైల్ ను జిల్లా ఎస్పీ స్వయంగా పర్యవేక్షించార‌ని తెలిపారు. మహిళల పై నేరాలకు పాల్పడే వారిపైనా కఠినమైన శిక్షలు పడేలా చర్యలు తీసుకున్నాం అనడానికి ఈ కేసు ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. కన్విక్షన్ బేస్డ్ పోలిసింగ్ ద్వారా కేవలం సంవత్సర కాలంలో గుర్తించిన ముఖ్యమైన 122 కేసుల్లో 102 కేసుల విచారణ పూర్తయి.. శిక్షలు పడ్డాయని డీజీపీ వెల్ల‌డించారు. 102 కేసుల్లో ముగ్గురికి మరణ శిక్ష, 37 మందికి జీవిత ఖైదీ, 62 కేసుల్లో 7 నుండి 20 సంవత్సరాల జైలు శిక్షలు ప‌డ్డాయ‌ని వివ‌రించారు. నిందితులు శిక్షింపబడటంలో సమర్ధవంతంగా విధులు నిర్వహించిన రేంజ్ ఐ‌జి, జిల్లా ఎస్పీ, సిబ్బందికి డీజీపీ అభినందనలు తెలిపారు.


Tags:    

Similar News