తెలుగు రాష్ట్రాల్లో మొదలైన కరోనా టెన్షన్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి టెన్షన్ మొదలైంది. 402 మందికి కరోనా టెస్టులు

Update: 2023-12-20 02:03 GMT

Corona cases in AP and Telangana

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి టెన్షన్ మొదలైంది. 402 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. 4 కేసులు పాజిటివ్​ వచ్చాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంగళవారం హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో మూడు గంటల పాటు కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 పై రివ్యూ జరిపారు. కొత్త వేరియంట్ ను ఎదుర్కొనేందుకు అన్ని ఆసుపత్రులను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో స్పెషల్ వార్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు సూపరింటెండెంట్ రాజారావుకు సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత ఇతర దేశాలు, రాష్ట్రాల పరిస్థితిపై ప్రభుత్వం నివేదిక కోరడంతో కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 పై డీహెచ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహమ్మారిని ఎదుర్కొనేందుకు అవసరమైన సన్నద్ధతపై వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉన్నస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఏర్పాటు చేసిన ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లను క్రియాశీలకం చేయాలని, రోజుకు కనీసం వెయ్యి పరీక్షలు నిర్వహించేలా సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల్లో ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లను సిద్ధం చేయాలని సూచించారు. ఫ్లూ జ్వరం లేదా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లు తప్పనిసరిగా చేయాలన్నారు. అన్ని ఆస్పత్రుల్లోనూ పీపీటీ, గ్లౌజులు, మాస్క్‌లు, శానిటైజర్లు వంటి రక్షణ పరికరాలను సిద్ధంగా ఉంచాలన్నారు. ముఖ్యంగా పండుగ సీజన్లలో అన్ని ప్రాంతాల్లో ప్రజల రద్దీ పెరుగనున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. శబరిమలై యాత్రకు వెళ్లే భక్తులు తగిన ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని సూచించారు.


Full View


Tags:    

Similar News