అమరావతి రైతులకు నేడు గుడ్ న్యూస్
రాజధాని అమరావతి రైతులకు నేడు గుడ్ న్యూస్ సీఆర్డీఏ చెప్పనుంది. రైతులకు రిటర్నబుల్ ప్లాట్లకు నేడు లాటరీ జరగనుంది.
రాజధాని అమరావతి రైతులకు నేడు గుడ్ న్యూస్ సీఆర్డీఏ చెప్పనుంది. రాధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లకు నేడు లాటరీ జరగనుంది. ఈరోజు సీఆర్డీఏ కార్యాలయంలో లాటరీ తీస్తారు. భూసమీకరణ పథకంలో భాగంగా ఏపీ సీఆర్డీఏకి అప్పగించిన రైతులకు ప్లాట్లను అప్పగించడంపై ఈ లాటరీ జరుగుతుంది. అమరావతి రాజధాని ప్రాంతంలోని పథ్నాలుగు గ్రామాల రైతులకు ర్యాండమ్ సిస్టమ్ ద్వారా రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించనున్నారు.
14 గ్రామాల్లో...
నవులూరు 1&2, కురగల్లు, 1&2, నిడమర్రు 1&1, రాయపూడి 1&2, లింగాయపాలెం, మల్కాపురం, నెక్కల్లు, శాఖమూరు, తుళ్లూరు 1&2, వెలగపూడి, మందడం 1&2, అనంతవరం, ఐనవోలు తదితర గ్రామాలలో సంబంధిత రైతులు ఈ లాటరీకి హాజరుకావాలని సీఆర్డీఏ అధికారులు కోరారు. రైతుల సమక్షంలోనే లాటరీని నిర్వహించనున్నారు.