Ambati Rayudu: వైసీపీకి ఊహించని షాక్ ఇచ్చిన అంబటి రాయుడు
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పారు. అధికార పార్టీని వీడుతున్నట్లు
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పారు. అధికార పార్టీని వీడుతున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. కేవలం కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి త్వరలో ప్రకటన చేస్తానంటూ తన ట్వీట్ లో చెప్పుకొచ్చాడు అంబటి రాయుడు. కొంతకాలంగా జగన్ పాలనపై అంబటి రాయుడు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ 28న ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్లు రాయుడు తన ట్వీట్ లో పేర్కొన్నారు.
వైసీపీలో చేరిక సందర్భంగా మీడియాతో రాయుడు మాట్లాడుతూ.. తాను మొదటి నుంచి వైఎస్ జగన్ అభిమానిని అన్నారు. సీఎం జగన్ అవకాశమిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని ప్రకటించారు. గుంటూరు ఎంపీ స్థానం నుంచి రాయుడు బరిలో దిగుతారని వార్తలు వినిపించాయి. అంబటి రాయుడు డిసెంబర్ 28న తాడేపల్లి నివాసంలో ఏపీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ కండువా కప్పుకున్న వారంలో రోజుల్లో అంబటి రాయుడు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు.