వీధులన్నీ జలమయం... రెండు రోజులుగా?
అధికారుల నిర్లక్ష్యంతో కాలువ నీరు వీధుల్లోకి వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం లో వీధులన్నీ నీటితో నిండిపోయాయి.
ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో పంట కాలువ నీరు వీధుల్లోకి వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లాలోని పి. గన్నవరం లో వీధులన్నీ నీటితో నిండిపోయాయి. ప్రధాన పంటకాలవ పొంగిపొరలడమే ఇందుకు కారణం. నీళ్లన్నీ వీధుల్లోకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులుగా పంటకాల్వ పొంగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అంతర్వేది ఉత్సవాలు కోసం....
పిగన్నవరం లోని కొత్త వెంకటేశ్వరస్వామి కాలనీ, కోళ్లవారి వీధి, నాయీబ్రాహ్మణ వీథుల్లో నీరు నిలిచిపోయింది. ఈ పంటకాల్వకు నీరు వదిలినప్పుడల్లా తమ ప్రాంతం నీటితో నిండిపోతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. లోతట్టులో ఉండటంతోనే ఈ పరిస్థితి అని అధికారులు చెబుతున్నారు. అంతర్వేది ఉత్సవాల కోసం అధికారులు అధిక నీటిని విడుదల చేయడంతో పి.గన్నవరంలోకి పంటకాల్వ నీరు ప్రవేశించింది.