Tirumala : నేడు తిరుమలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు.
Tirumala :తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ ఖాళీగానే కనపడుతున్నాయి. శ్రీవారి దర్శనం భక్తులకు సులువుగానే అవుతుంది. వసతి గృహాల విషయంలోనూ భక్తులు పెద్దగా ఇబ్బంది పడటం లేదు. తిరుమలలోని వీధులు కూడా పెద్దగా రద్దీ లేదు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం గంట సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
నేరుగానే దర్శనం...
నిన్న తిరుమల శ్రీవారిని 63,251 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 20,989 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.14 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండకుండానే భక్తులు స్వామి వారిని నేరుగా దర్శించుకుంటున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుంది.