తిరుమలలో తగ్గిన రద్దీ.. దర్శనానికి?

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. సోమవారం భక్తుల సంఖ్య తక్కువగా ఉంది.

Update: 2023-01-23 02:35 GMT

 TirumalaTirupati

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. సోమవారం భక్తుల సంఖ్య తక్కువగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కేవలం రెండు కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూలైన్ లో వేచి ఉన్న భక్తులకు స్వామి వారి దర్శనం ఐదు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఇప్పుడు సర్వదర్శనం క్యూ లైన్ లో ప్రవేశించే భక్తులకు మాత్రం పన్నెండు గంటల సమయం పడుతుందని చెబుతున్నారు.

హుండీ ఆదాయం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల్లో శ్రీవారి దర్శనం పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 72,998 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 24,852 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.51 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News