Tirumala : నేడు రష్ నిల్.. నేరుగా స్వామి వారి దర్శనం
తిరుమలలో నేడు భక్తుల రద్దీ తగ్గింది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు
తిరుమలలో నేడు భక్తుల రద్దీ తగ్గింది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు. పదో తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో తిరుమలలో భక్తులు పెద్దగా రాలేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండకుండానే నేరుగా స్వామి వారిని భక్తులు దర్శించుకుంటున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం గంటలో పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమల శ్రీవారి దర్శనం సులభంగా జరుగుతుంది. కంపార్ట్‌మెంట్లలో వేచి చూడకుండానే క్యూ లైన్ లలో నేరుగా వెళ్లిపోతున్నారు. సర్వదర్శనం క్యూ లైన్‌లో ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు స్వామి వారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 83,825 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,690 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.57 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.