Tirumala : బుధవారం భక్తుల రద్దీ తిరుమలలో ఎలా ఉందో తెలిస్తే షాకవ్వాల్సిందే?
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. బుధవారం అయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు;

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. బుధవారం అయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి క్యూ లైన్ బయట వరకూ విస్తరించి ఉండటంతో గంటల పాటు స్వామి సమయం దర్శనానికి సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. దీంతో అత్యధిక మంతి క్యూ లైన్ లో బయట వరకూ వేచి ఉండటంతో వేసవి తీవ్రత తగలకుండా టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటుంది. భక్తులందరికీ చల్లటి మజ్జిగ, మంచినీరు, అన్నప్రసాదాలను క్యూ లైన్ లో వేచి ఉన్నవారికి పంపిణీ చేస్తుంది.
వరస సెలవులతో...
వరసగా సెలవులు వస్తుండటంతో భక్తుల రద్దీ పెరిగిందని తెలిపారు. ఉగాది పండగ నాడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, దీంతో పాటు శుక్ర, శని, ఆదివారాలు కూడా ఉండటంతో భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు వేడి గాలులు కూడా వీస్తుండటంతో అన్ని చర్యలు తీసుకుంటున్నారు. లడ్డూల తయారీని కూడా అధికంగా చేస్తున్నారు. అన్నదాన సత్రం వద్ద కూడా రద్దీ అధికంగా కనిపిస్తుంది.
అన్ని కంపార్ట్ మెంట్లన్నీ నిండి...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. బయట క్యూ లైన్ ఎంబీసీ వరకూ విస్తరించి ఉంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 64,252 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,943 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.68 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.