Tirumala : నేరుగా స్వామి వారి దర్శనానికి
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గలేదు. దసరా సెలవులు కావడంతో నిత్యం తిరుమల కొండ రద్దీగానే ఉంటుంది
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గలేదు. దసరా సెలవులు కావడంతో నిత్యం తిరుమల కొండ రద్దీగానే ఉంటుంది. గోవింద నామ స్మరణలతో మారుమోగుతుంది. బ్రహ్మోత్సవాలు ముగియడంతో రద్దీ తగ్గుతుందని భావించినా ఏమాత్రం తగ్గకుండా భక్తులతో క్యూ లైన్లన్నీ నిండిపోతున్నాయి. వసతి గృహాల కోసం కూడా భక్తులు క్యూ కడుతున్నారు. వసతి గృహాలు రెండు రోజుల పాటు మించి ఎవరికి ఇవ్వడం లేదు. ఒకరోజు మాత్రమే వసతి గృహాన్ని పొడిగిస్తున్న టీటీడీ వసతి గదుల కేటాయింపుపై మాత్రం కఠినంగానే వ్యవహరిస్తుంది.
క్యూ లైన్లలో...
నిన్న తిరుమల శ్రీవారిని 71,037 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. వీరిలో 20,563 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.66 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని క్యూ లైన్ల నుంచి నేరుగా దర్శనానికి వెళుతున్నారు. టోకెన్లు లేని భక్తులకు దర్శనం ఐదు గంటల సమయం పడుతుంది.