Tirumala : తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ అంతగా లేదు.. కారణమిదే

తిరుమలలో భక్తుల రద్దీ ఈరోజు తక్కువగా ఉంది. శనివారం అయినా సరే భక్తుల రాక పెద్దగా లేదు.

Update: 2024-10-26 03:04 GMT

తిరుమలలో భక్తుల రద్దీ ఈరోజు తక్కువగా ఉంది. శనివారం అయినా సరే భక్తుల రాక పెద్దగా లేదు. స్వామి వారి దర్శనం సులువుగా పూర్తి చేసుకుని భక్తులు ఆనంద పరవశ్యంలో మునిగితేలుతున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని శనివారం దర్శించుకుంటే మంచిదని, శుభప్రదమని భక్తులు విశ్వసిస్తారు. దేశం నలుమూలల నుంచి భక్తులు శనివారం కోసం వెయిట్ చేసి ముందుగా టిక్కెట్లను బుక్ చేసుకుంటుంటారు. తమ మొక్కులు కూడా శనివారం తీర్చుకుంటే మంచిదని భావిస్తారు. తలనీలాలను సమర్పించడం కూడా శనివారం స్వామి వారి చెంతకు చేరుకుంటారు. అలాగే హుండీలో మొక్కులు తీర్చుకోవాలనుకున్నా, తాము గతంలో కోరుకున్న మొక్కులు నెరవేరినా శనివారం నాడు అవి తీర్చుకుని స్వామి వారిని దర్శించుకోవడం మంచిదని భావిస్తారు. అందుకే శనివారం అంటే తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. బయట వరకూ క్యూ లైన్ లు కనపడుతూ ఉంటాయి. వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారుతుంది.

ఐదు కంపార్ట్‌మెంట్లలోనే...
అటువంటిది ఈరోజు మాత్రం అన్నీ సులువుగా లభిస్తున్నాయి. వసతి గదులు వెంటనే దొరుకుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో రాకపోవడానికి దానా తుపాను హెచ్చరికలే కారణంగా చూడాలి. రైళ్లు రద్దు కావడం, తమిళనాడులోనూ భారీ వర్షాలు పడుతుండటంతో భక్తుల సంఖ్య తక్కువగా ఉంది. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఐదు కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన వారికి గంట నుంచి రెండు గంటల సమయంలోనే దర్శనం పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 56,501 మంది దర్శించుకున్నారు. వీరిలో 21,203 మంది తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.78 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News