Tirumala : నేడు తిరుమలలో రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా లేదు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా లేదు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులతో పాటు ముందుగా బుక్ చేసుకున్న భక్తులు తిరుమలకు చేరుకున్నారు. వసతి గృహాలు కూడా నేడు సులువుగానే దొరుకుతున్నాయి. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి స్వామి వారి దర్శనం మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 78,731 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,156 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.40 కోట్ల రూపాయలు వచ్చింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఎనిమిది కంపార్ట్‌మెంట్లలో స్వామి వారి దర్శనానికి భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనానికి మాత్రం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది.