Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే? నమ్మలేరు అంతే
తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. గురువారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో లేరు
తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. గురువారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో లేరు. వీధులలో కూడా పెద్దగా భక్తులు కనిపించడం లేదు. దర్శనానికి సులువుగానే అనుకున్న సమయంలో పూర్తవుతుంది. పెద్దగా వేచి ఉండకుండానే శ్రీవారి దర్శనం పూర్తి అవుతుండటతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి చెంత కూడా పెద్దగా తోపులాట లేకుండానే కనులారా స్వామి వారిని చూసుకునే భాగ్యం కలుగుతుందని భక్తులు హ్యాపీ ఫీలవుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో క్షణ కాలం కూడా స్వామి చెంత ఉంచే అవకాశం లేదు. మిగిలిన భక్తులు దర్శనం చేసుకోవాలంటే త్వరగా స్వామి వారి వద్ద నుంచి వెళ్లిపోవాలని శ్రీవారి సేవకులతో పాటు భద్రతా సిబ్బంది భక్తులను తోసేస్తుంటారు. దీంతో అంత దూరం తిరుమలకు వెళ్లి ఏడుకొండల వాడిని మనస్ఫూర్తిగా కనులారా దర్శించుకునే వీలు కలగడం లేదని అనేక మంది భక్తులు ఆవేదన చెందుతుంటారు. అయితే రద్దీ తక్కువగా ఉన్న సమయంలో మాత్రం పెద్దగా వాళ్లు కూడా భక్తులను ఇబ్బంది పెట్టకుండా స్వామివారిని తృప్తిగా చూసుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. తిరుమలలో రేపటి నుంచి మళ్లీ భక్తుల రద్దీ పెరిగే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు.