తిరుమలలో తగ్గిన రద్దీ

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ తగ్గింది. ఉత్తర ద్వార దర్శనం నుంచి భక్తులు దర్శించుకుంటున్నారు

Update: 2023-01-07 03:42 GMT

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ తగ్గింది. ఉత్తర ద్వార దర్శనం నుంచి భక్తులు దర్శించుకుంటున్నారు. ముందుగానే టిక్కెట్లు విక్రయిస్తుండటం, ప్రత్యేక దర్శనాలు లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య తగ్గిందంటున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 45,883 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 17,702 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.53 కోట్ల రూపాయలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

ప్రత్యేక దర్శనం టిక్కెట్లు...
శ్రీవారి ప్రత్యేక దర్శనం టిక్కెట్ల విడుదలను ఈ నెల 9న తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. ఉదయం పది గంటలకు ఆన్‌లైన్ లో టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. జనవరి 11వ తేదీ వరకూ వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతుండటంతో జనవరి 12 నుంచి 31వ తేదీ వరకూ, ఫిబ్రవరి నెలకు సంబంధించి టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధకారులు వెల్లడించారు.


Tags:    

Similar News