Michoung Cyclone : మళ్లీ దిశను మార్చుకుంది.. ఈసారి సింహపురి పై
మిచౌంగ్ తుఫాను తన గమనాన్ని మార్చుకుంది.రేపు మధ్యాహ్నం లోపు తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతోంది
మిచౌంగ్ తుఫాను తన గమనాన్ని మార్చుకుంది.రేపు మధ్యాహ్నం లోపు తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతోంది. నెల్లూరు - కావలి మధ్యలో రామతీర్థం దగ్గరలో మిచౌంగ్ తుఫాన్ తీరం దాటే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
రోజూ దిశను మార్చుకుని...
మిచౌంగ్ తుఫాను రోజూ తన దిశను మార్చుకుంటూ పయనిస్తుంది. ఈ నెల 1వ తేదీన ఒడిశాకు వెళ్లే విధంగా ఉన్న తుఫాను దిశను మార్చుకుని 2,3 తేదీల్లో తీరం దాటుతుందని అధికారులు అంచనా వేశారు. బాపట్ల వద్ద తీరం దాటే అవకాశాలున్నాయని కూడా నిన్న చెప్పారు. అయితే ఇప్పుడు మళ్లీ దిశను మార్చుకుని నెల్లూరు - కావలి మధ్య తీరం దాటే అవకాశముందని చెబుతున్నారు. ఈ సమయంలో ఈదురుగాలులు వీస్తాయని, విద్యుత్తు స్థంభాలు నేలకొరిగే అవకాశముందని కూడా అంచనా వేస్తున్నారు.