పురందేశ్వరి.. మళ్లీ అదే మాట

బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు పవన్ కళ్యాణ్

Update: 2023-09-20 10:42 GMT

టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందని ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే, బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి జనసేనతో మాత్రమే పొత్తు ఉందని.. ఎన్నికల సమయంలోనే పొత్తులపై తుది నిర్ణయం వస్తుందని తెలిపారు. పొత్తులపై అధిష్టానం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని పురంధేశ్వరి స్పష్టం చేశారు. ఎన్నికలకు మూడు, నాలుగు నెలల ముందు మాత్రమే పొత్తులపై పార్టీలో చర్చ జరుగుతుందన్నారు. పవన్‌ కళ్యాణ్ ప్రస్తుతానికి ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నారని.. టీడీపీతో పొత్తుపై జాతీయ నాయకత్వంతో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ చర్చించిన తర్వాత బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని పురంధేశ్వరి తేల్చి చెప్పారు.

తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఉమ్మడి కార్యాచరణపై దృష్టి పెట్టాయి. తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ ఏర్పాటుపై ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే టీడీపీ, జనసేన శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాల్లో కలిసి పనిచేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ అంశంలో టీడీపీ పిలుపునిచ్చిన రిలే నిరాహార దీక్షల్లో సైతం జన సైనికులు పాల్గొంటున్నారు. అయితే ఈ పొత్తు గురించి వైసీపీ మొదటి నుండి అలర్ట్ గానే ఉంది


Tags:    

Similar News