ఏపీలో పెరిగిన విద్యుత్తు ఛార్జీలు

Update: 2022-03-30 07:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్తు ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. జగన్ ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్ల తర్వాత విద్యుత్తు ఛార్జీలను పెంచాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న డిస్కమ్ లు నష్టాల్లో ఉన్నాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో విద్యుత్తు ఛార్జీలు పెంచాల్సి వస్తుందని, ప్రజలు సహకరించాలని కోరుతున్నారు. గృహ వినియోగదారుల కు భారం పడనుంది. ఈ ఛార్జిల పెంపుతో ప్రభుత్వానికి 1400 కోట్ల రూపాయల ఆదాయం లభించనుంది. మొత్తం ఆరు శ్లాబ్ లలో ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

పెంపుదల ఇలా....
ముప్పయి యూనిట్ల వరకూ యూనిట్ కు నలభై ఐదు పైసలు, 31 నుంచి 75 యూనిట్ల వరకూ యూనిట్ కు 91 పైసలు, 76 నుంచి 125 వరకూ యూనిట్ కు 1.40 పైసలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏపీ ఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ నాగార్జున్ రెడ్డి ఈ మేరకు పెరగనున్న విద్యుత్తు ధరల టారిఫ్ ను విడుదల చేశారు. ఉచిత విద్యుత్తును యధాతధంగా కొనసాగిస్తారు. స్వల్పంగానే ధరలను పెంచామని, ప్రజలు అర్థం చేసుకోవాలని జస్టిస్ నాగార్జున రెడ్డి కోరారు. ఏపీఈఆర్సీ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది.


Tags:    

Similar News