మృతదేహాన్ని 5 కిలోమీటర్లు మోసిన ఎస్ఐ

కుళ్లిపోయిన మృతదేహాన్ని మహిళ ఎస్ఐ ఐదు కిలోమీటర్లు మోశారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది

Update: 2022-03-21 14:29 GMT

కుళ్లిపోయిన మృతదేహాన్ని మహిళ ఎస్ఐ ఐదు కిలోమీటర్లు మోశారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం హాజీపురం గ్రామం అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తి మృతదేహం పడి ఉంది. పూర్తిగా కుళ్లపోయిన స్థితిలో ఉంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

ఎవరూ ముందుకు రాకపోవడంతో....
దీంతో మృతదేహాన్ని అటవీ ప్రాంతం నుంచి రహదారి వరకూ తరలించేందుకు మహిళ ఎస్ఐ కృష్ణ పావని డోలీలో మోశారు. వెదురు బొంగుల సాయంతో డోలీ కట్టి మృతదేహాన్ని రోడ్డు వరకూ తరలించారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మహిళ ఎస్ఐ కృష్ణ పావనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


Tags:    

Similar News