ఇప్పటం గ్రామంలో ఉద్రిక్తత
గుంటూరు జిల్లా తాడేపల్లి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత వివాదానికి దారి తీసింది
గుంటూరు జిల్లా తాడేపల్లి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత వివాదానికి దారి తీసింది. రోడ్డు విస్తరణ పేరుతో ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటం గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. గతంలో జనసేన కార్యక్రమాన్ని జరుపుకునేందుకు ఇప్పటం గ్రామస్థులు తమ భూములను ఇచ్చారు. తమ భూముల్లో సభను నిర్వహించుకోవడానికి స్థలాన్ని కేటాయించిన ఇప్పటం గ్రామస్థులను పవన్ కల్యాణ్ సన్మానించారు కూడా.
ఇళ్లు కూల్చివేతతో...
ఈ నేపథ్యంలో తాము జనసేన సభకు స్థలాన్ని ఇచ్చామనే ఈ కూల్చివేతలను చేస్తున్నారని ఇప్పటం గ్రామ ప్రజలు చెబుతున్నారు. ఈ గ్రామానికి బస్సు సౌకర్యం కూడా లేదని, ఎందుకు రోడ్డు విస్తరణ చేపడుతున్నారో తెలియదని ప్రజలు చెబుతున్నారు. స్కూల్ బస్సులు తిరిగేందుకు రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లను కూలగొడుతున్నారని, ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యేనని గ్రామస్థులు చెబుతున్నారు. పోలీసులు భారీగా మొహరించి ఆందోళన నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.