తిరుపతిలో భారీ ర్యాలీ
మూడు రాజధానుల అవసరాన్ని చెబుతూ తిరుపతిలో రాయలసీమ ఆత్మ గౌరవ ప్రదర్శన ప్రారంభమయింది.
మూడు రాజధానుల అవసరాన్ని చెబుతూ తిరుపతిలో రాయలసీమ ఆత్మ గౌరవ ప్రదర్శన ప్రారంభమయింది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న నినాదంతో ప్రారంభమయిన ఈ ప్రదర్శనకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో పాటు పాటు రాయలసీమ పరిరక్షణ సమితి, మానవ వికాస వేదికలు ఈ ప్రదర్శనలు చేపట్టాయి. రాయలసీమలోని నాలుగు జిల్లాల నుంచి ఈ ర్యాలీకి ప్రజలు హాజరయ్యారు.
రాయలసీమకు...
రాయలసీమకు కొన్నేళ్లుగా అన్యాయం జరుగుతుందని, ఈసారైనా న్యాయం చేయాలని, జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రతిపాదనకు మద్దతు తెలిపేందుకు ఈ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ప్రదర్శన అనంతరం జరిగే బహిరంగ సభలో పలువురు సీమ జిల్లాలకు చెందిన నేతలతో పాటు ప్రొఫెసర్లు, మేధావులు ప్రసంగించనున్నారు. రాయలసీమ అభివృద్ధికి రాజధాని ఏర్పాటు ఒక్కటే మార్గమని వారు నినాదాలు చేస్తున్నారు.