Pawan Kalyan : తనపై ట్రోలింగ్ కు గట్టి ఆన్సర్ ఇచ్చిన పవన్ కల్యాణ్
తాను ఎందుకు సహాయక చర్యల్లో పాల్గొననది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు
తాను ఎందుకు సహాయక చర్యల్లో పాల్గొననది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశంసించక్కరలేదు కానీ, ఇటువంటి విపత్కర సమయంలో విమర్శలు చేయకుండా అవసరమైన సూచనలు చేయాలని పవన్ కల్యాణ‌్ వైసీపీ నేతలకు సూచించారు. గతంలో వైసీీపీ వాళ్లు ఎంతో కొంత పనిచేసి ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.
అధికారంలోకి వచ్చి...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు కూడా పూర్తి కాలేదని ఆయన గుర్తు చేశారు. అనేక సవాళ్ల మధ్య అధికారాన్ని చేపట్టామని పవన్ తెలిపారు. సహాయక చర్యలకు ఇబ్బంది అవుతుందంటేనే తాను వరద ప్రాంతాల్లో పర్యటనకు ఆగిపోయానని పవన్ కల్యాణ్ తెలిపారు. తనను ఎందుకు రాలేదని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వారికి పవన్ కల్యాణ్ ఈ మీడియా సమావేశం ద్వారా సమాధానం చెప్పారు. బుడమేరు మొత్తం ఆక్రమణలకు గురయిందని పవన్ కల్యాణ‌్ అన్నారు. దీని ఫలితమే గతంలో ఎన్నడూ రాని వరద వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.