అల్లు వారి గురించేనా? పవన్ ఆ కామెంట్స్ చేసింది..?

డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ‌్ చేసిన వ్యాఖ్యలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించేనా? అన్న చర్చ జరుగుతుంది.

Update: 2024-08-08 12:15 GMT

డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ‌్ చేసిన వ్యాఖ్యలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించేనా? అన్న చర్చ జరుగుతుంది. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకప్పుడు సినిమాల్లో హీరో అడవులను కాపాడుతుండే వారని, కానీ ఇప్పుడు స్మగ్లింగ్ చేయడమే హీరోయిజంగా చూపిస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు టాలివుడ్ లో వైరల్ అయ్యాయి.

సినిమాల్లో హీరోలు...
అల్లు అర్జున్ పుష్ప సినిమా గురించి పవన్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిరెడ్డికి బహిరంగ మద్దతు ఇచ్చిన అల్లుఅర్జున్ కు, మెగా ఫ్యామిలీకి మధ్య గ్యాప్ పెరిగిందని వస్తున్న వార్తలు పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ మరింత బలం చేకూరుస్తున్నాయి. ఒక సినిమా వ్యక్తిగా తనకు అలాంటి మూవీలు చేయడం ఇష్టం లేదని, మంచి మెసేజ్ ఇవ్వాల్సిన హీరోలు స్మగ్లింగ్ ప్రధానాంశంగా సినిమాలు తీయడాన్ని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News