Tirumala : నేడు కూడా తిరుమలలో రష్.. ఎందుకంటే?
తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం కూడా పెద్దసంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు
తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం కూడా పెద్దసంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. స్వామి వారి దర్శనానికి గంటల సమయం పడుతుంది. వసతి గృహాలు కూడా దొరకక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారిగా భక్తుల సంఖ్య పెరగడంతో అన్నప్రసాద వితరణ, వసతి వంటి ఏర్పాట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది.
ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పథ్నాలుగు కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పది గంటలకు పైగా సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 62,304 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 20,261 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.61 కోట్ల రూపాయలు వచ్చింది.