Tirumala : నేడు తిరుమలలో శ్రీవారి దర్శనం ఎంత కష్టమో తెలిస్తే?

తిరుమలలో భక్తులు రద్దీ కొనసాగుతుంది. బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో అత్యధిక శాఖ మంది హాజరవుతున్నారు

Update: 2024-10-07 02:31 GMT

Tirumala darshan 

తిరుమలలో భక్తులు రద్దీ కొనసాగుతుంది. బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో అత్యధిక శాఖ మంది హాజరవుతున్నారు. దసరా సెలవులు కూడా ఇవ్వడంతో సోమవారం కూడా భక్తులతో తిరుమల కిటికిటలాడిపోతుంది. ఎక్కడ చూసినా భక్త జనసందోహమే. కనీసం మంచినీరు బాటిల్స్ కూడా దొరకడం కష్టంగా మారింది. ఎక్కడైనా క్యూలే దర్శనమిస్తున్నాయి. కేవలం దర్శనానికి మాత్రమే కాదు భోజనానికి, టిఫిన్లకు, టీ తాగేందుకు కూడా చాలా సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. రేపు గరుడ వాహనంపై స్వామి వారు విహరించడంతో లక్షలాది మంది భక్తులు వస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక శ్రీవారి దర్శనం కూడా అంత సులువుగా జరగడం లేదు. అన్ని వీఐపీ దర్శనాలను, బ్రేక్ దర్శనాలను రద్దు చేసినప్పటికీ గంటల కొద్దీ సమయం క్యూ లైన్ లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం నిరీక్షించాల్సి వస్తుంది. క్యూ లైన్ చాంతాండత ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అన్ని చర్యలు తీసుకున్నప్పటకీ ఇబ్బందులు తప్పడం లేదు.

అన్ని కంపార్ట్‌మెంట్లు...
ముఖ్యంగా స్వామి వారి వాహనసేవలను చూసేందుకు మాడ వీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామి వారిని దగ్గర నుంచి వీక్షించేందుకు మాడవీధుల్లోనే గడుపుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళలో స్వామి వారు మాడ వీధుల్లో విహరించనున్నారు. ఈరోజు తిరుమల వైకుంఠం కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లలో భక్తులు నిండిపోయారు. భక్తుల క్యూ లైన్ బయట కృష్ణ తేజ గెస్ట్‌హౌస్ వరకూ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోని భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. వీరికి శ్రీవారి సేవకులు అన్న ప్రసాదాలను, మంచినీటిని అందచేస్తున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 88,859 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 37,178 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.63 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. రేపు రద్దీ మరింత అవకాశం ఉండటంతో నేటి నుంచే ద్విచక్ర వాహనాలను కొండపైకి నిషేధించారు.
Tags:    

Similar News