శ్రీవారి దర్శనానికి 12 గంటలు.. దర్శించుకోవాలంటే ఇవి ఉండాల్సిందే..

స్పెషల్ దర్శనానికి 3-4 గంటలు, దివ్య దర్శనానికి 6-8 గంటల సమయం పడుతుందని టిటిడి వెల్లడించింది.

Update: 2022-12-25 04:04 GMT

tirumala rush today

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ప్రస్తుతం స్వామివారి సర్వదర్శనానికై 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 12 నుండి 14 గంటల సమయం పడుతుంది. స్పెషల్ దర్శనానికి 3-4 గంటలు, దివ్య దర్శనానికి 6-8 గంటల సమయం పడుతుందని టిటిడి వెల్లడించింది. ఇక ప్రతిరోజూ 2000 వైకుంఠ ద్వార దర్శనాల టికెట్లను విడుదల చేస్తోంది టిటిడి. శుక్రవారం విడుదలైన టికెట్ల కోసం భక్తులు పోటీ పడ్డారు. జనవరి 2 నుండి 11 వరకు రోజుకు 50 వేల చొప్పున 5 లక్షల సర్వదర్శనం టికెట్లను అందుబాటులో ఉంచనుంది టీటీడీ. ఆ సమయంలో సామాన్యులకు కూడా వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది.

కాగా.. వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులు 48 గంటల ముందు కోవిడ్ పరీక్ష చేయించుకుని నెగిటివ్ సర్టిఫికేట్ లేదా కరోనా వ్యాక్సినేషన్ ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా చూపించాలని టీటీడీ ఆదేశించింది. ధృవీకరణ పత్రాలు లేని భక్తులను దర్శనానికి అనుమతించబోమని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రకటించింది. ఆ పదిరోజుల్లో భక్తుల రద్దీ పెరుగుతుందని టీటీడీ అంచనా వేస్తోంది. అందుక తగు ఏర్పాట్లను చేస్తోంది.


Tags:    

Similar News