ఏసీబీ దాడుల్లో భారీగా నగదు స్వాధీనం

రెండు రోజుల్లో ఏసీబీ దాడుల్లో భారీగా లెక్క చూపని నగదును పట్టుకున్నారని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు

Update: 2023-04-28 02:12 GMT

గత రెండు రోజుల్లో ఏసీబీ దాడుల్లో భారీగా లెక్క చూపని నగదును పట్టుకున్నారని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిపిన దాడుల్లో 1,09,28,000 నగదును పట్టుకున్నట్లు డీజీపీ తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో ఎక్కువ అవినీతి జరుగుతుందన్న ఫిర్యాదులతో రెండు రోజుల పాటు ఏసీబీ అధికారులు సబ్ రిజస్ట్రార్ కార్యాలయాల్లో దాడులు చేసిన సంగతి తెలిసిందే.

కాల్ సెంటర్‌కు...
ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ కాల్ సెంటర్ 14400కు కాల్ చేయాలని డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి కోరారు. యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు. రెండు రోజుల పాటు ఏసీీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్, తహసిల్దార్ కార్యాలయాల్లో దాడులు జరిపి లెక్కకు దొరకని నగదును స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. రెండు ఎమ్మార్వో కార్యాలయాలపై కూడా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి సోదాలు నిర్వహించడం జరిగిందని డీజీపీ తెలిపారు.


Tags:    

Similar News