కాకినాడ జిల్లాలో డయేరియా కలకలం
కాకినాడ జిల్లాలో డయేరియా కలకలం రేపుతుంది. కొమ్మనాపల్లి గ్రామంలో యాభై మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు
కాకినాడ జిల్లాలో డయేరియా కలకలం రేపుతుంది. కొమ్మనాపల్లి గ్రామంలో యాభై మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఒక మహిళ మరణించింది. వాంతులు, విరేచనాలతో ఆసుపత్రులో చేరే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. వాటర్ ట్యాంక్ లో నీటిని పరీక్షల కోసం అధికారులు పంపారు. నివేదిక వచ్చిన తర్వాతనే డయేరియా ప్రబలడానికి గల కారణాలు తెలుస్తాయంటున్నారు అధికారులు.
వైద్య శిబిరాలను...
కొమ్మనాపల్లి గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అన్ని శాఖల అధికారులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎవరైనా వాంతులు, విరేచనాలతో బాధపడుతుంటే వెంటనే ఆసుపత్రికి రావాలని అధికారులు కోరుతున్నారు. మరోవైపు రొయ్యలకూర తిన్న వాళ్లే వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారని మరికొందరు చెబుతున్నారు. మొత్తం మీద డయేరియా కాకినాడ జిల్లాలో కలకలం రేపుతుంది.