బీసీలపై కక్ష సాధింపు చర్యేనన్న జంగా
తనపై అనర్హత వేటు కక్షపూరిత చర్య అని అనర్హత వేటుపడిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు
తనపై అనర్హత వేటు కక్షపూరిత చర్య అని అనర్హత వేటుపడిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. పార్టీ మార్పుపై తన వద్ద నుంచి మౌఖికంగా వివరణ తీసుకోలేదన్నారు. ఇది బీసీలకు వ్యతిరేకంగా తీసుకున్న చర్య అని టీడీపీ నేత జంగా కృష్ణమూర్తి అన్నారు. ఛైర్మన్ పై ఒత్తిడి తెచ్చి తనపై వేటు వేయించారన్నారు.
వారిద్దరిపై వేటు...
వల్లభనేని వంశీ, మద్దాలి గిరిపై రెండేళ్ల నుంచి ఎందుకు చర్యలు తీసుకోలేదని టీడీపీ నేత జంగా కృష్ణమూర్తి ప్రశ్నించారు. బీసీలను వైసీపీ అణగదొక్కుతోందని ఆయన అన్నారు. వైసీపీలో ఎవరినైనా వాడుకొని వదిలేస్తారన్న ఆయన అందుకు తన ఉదంతమే నిదర్శనమని తెలిపారు.