నిలకడగా ఉన్న తెప్ప మీద అమ్మవారు

కనకదుర్గమ్మ అమ్మవారి తెప్పోత్సవం ఈరోజు నిలకడగా ఉన్న తెప్ప మీద జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు

Update: 2022-10-04 06:22 GMT

కనకదుర్గమ్మ అమ్మవారి తెప్పోత్సవం ఈరోజు నిలకడగా ఉన్న తెప్ప మీద జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. కృష్ణానది ఉప్పొంగుతున్న ఈసారి నిలకడగా ఉన్న తెప్ప మీద అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని ఆయన తెలిపారు. విజయదశమి రోజున నిర్వహించే ఈ తెప్పోత్సవానికి లక్షలాది మంది ప్రజలు హాజరవుతారు. అయితే మల్లేశ్వరస్వామితో జలవిహారం చేసే తెప్పోత్సవం ఈఏడాది నది ఉధృతి కారణంగా జరపలేకపోతున్నామని ఆయన తెలిపారు.

మాజీ మంత్రి కొడాలి నాని...
ఈరోజు మహిషాసుర మర్ధనీ దేవి అలంకారంలో దర్శనమిచ్చే అమ్మవారిని వేల సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కలెక్టర్ ఢిల్లీరావు కూడా అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను అందుకున్నారు.


Tags:    

Similar News