Pawan Kalyan : పవన్ ఆఫీస్ పై డ్రోన్ .. కలకలం
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు చెందిన కార్యాలయంపై డ్రోన్ తిరగటం కలకలం రేపింది.;

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు చెందిన కార్యాలయంపై డ్రోన్ తిరగటం కలకలం రేపింది. మంగళగిరిలోని పవన్ క్యాంప్ కార్యాలయంపై ఈ డ్రోన్ తిరిగినట్లు సిబ్బంది కనుగొన్నారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 1.50 గంటల మధ్య డ్రోన్ పవన్ క్యాంప్ కార్యాలయంపై తిరుగాడినట్లు పవన్ కార్యాలయ సిబ్బంది గుర్తించారు.
ఫిర్యాదు చేసిన...
వెంటనే గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్సీకి పవన్ కల్యాణ్ కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు చేశారు. దీంతోపాటు రాష్ట్ర డీజీపీకి కూడా జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. అస్సలు గుర్తుతెలియని వ్యక్తులు ఈ డ్రోన్ ఎగురే వేశారన్న అనుమానాలను జనసేన నేతలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.