గోదావరి ఆగ్రహం.. లంక గ్రామాల్లో అలెర్ట్

భారీ వర్షాలతో గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతోంది.

Update: 2022-07-09 03:26 GMT

భారీ వర్షాలతో గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. 1.15 లక్షల క్యూసెక్కుల వరదనీటిని కిందకు వదులుతున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ నీటిమట్టం9.7 అడుగులకు చేరుకుంది. 17 గేట్ల ద్వారా వరద జలాలను సముద్రంలోకి వదులుతున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. దీంతో పాటు భారీ వర్ష సూచన వాతావరణ శాఖ నుంచి జారీ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

కంట్రోల్ రూమ్...
ప్రధానంగా లంక గ్రామాలు వణికిపోతున్నాయి. లోతట్టు ప్రాంత గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. జిల్లాలో అధికారులకు సెలవులను రద్దు చేశారు. సహాయక కార్యక్రమాలను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు ప్రకటించారు.


Tags:    

Similar News