చిత్తూరులో మరోసారి భూ ప్రకంపనలు.. అర్థరాత్రి నుంచి జాగారం

చిత్తూరు జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో అక్కడి జనం ఇళ్ల నుంచి బయటికి పరుగుపెట్టారు.

Update: 2021-12-08 05:45 GMT

చిత్తూరు జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో అక్కడి జనం ఇళ్ల నుంచి బయటికి పరుగుపెట్టారు. రామకుప్పం మండలంలోని గడ్డూరు, చిన్నగరిగేపల్లి, ఎస్ గొల్లపల్లి, గొరివిమాకులపల్లిలో వస్తున్న వరుస భూ ప్రకంపనలు అక్కడి ప్రజలకు నిద్రాహారాలు లేకుండా చేస్తున్నాయి. అర్థరాత్రి నుంచి వింత శబ్దాలు రావడంతో పరుగులు పెట్టిన జనం..తెల్లవారేవరకు జాగారం చేశారు. అయితే.. లోకల్ క్వారీల వల్లే ఇంత భారీ శబ్దాలు వస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు.

వింత శబ్దాలు...
ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు సమాచారం ఇచ్చినా.. ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఇక్కడే వింత శబ్దాలు రావడంతో ఇళ్లలో ఉండలేక.. గుట్టలపైకి చేరుకున్నారు కొందరు నివాసితులు. ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల క్రితం అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలంలో మదిరేబైలు గ్రామంలో కూడా వింతశబ్దాలు భయాందోళనకు గురిచేశాయి. రేయి, పగలు తేడా లేకుండా పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో భూమి కంపించినట్లు అవుతుందని స్థానికులు భయాందోళనకు గురయ్యారు.


Tags:    

Similar News