YCP : ఎన్నికల సమయంలో జగన్ పార్టీకి ఎన్నికల కమిషన్ ఝలక్
ఎన్నికల వేళ జగన్ పార్టీకి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది;
ఎన్నికల వేళ జగన్ పార్టీకి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లను ప్రభుత్వ సంక్షేమ పథకాలను పంపిణీ చేయడానికి దూరంగా ఉంచాలని నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పింఛను, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వాలంటీర్ల చేత ఇప్పించవద్దని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో వచ్చే నెల ఒకటో తేదీన ఇంటింటికి పంపిణీ చేయనున్న పింఛను అందే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.
వాళ్ల ఫోన్లను కూడా....
ఎన్నికల నియమావళి సమయం ముగిసేంత వరకూ వారికి ఈ పథకాల పంపిణీ బాధ్యతలను అప్పగించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లతో పాటు వారివద్ద ఉన్న ట్యాబ్‌లు ఇతర పరికరాలను కూడా స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం పింఛను వంటి వాటిని నగదు బదిలీ ద్వారా చేయవచ్చని ఎన్నికల కమిషన్ సూచించింది.