ఆ బూత్ లో పీవోతో పాటు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు

పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ ప్రిసైడింగ్ అధికిరితో పాటు ఇతర సిబ్బంది ని ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది.

Update: 2024-05-23 02:56 GMT

పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ ప్రిసైడింగ్ అధికిరితో పాటు ఇతర సిబ్బంది ని ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. మాచర్ల పోలింగ్ స్టేషన్ లో ఈవీఎం ధ్వంసం కేసులో జరిగిన సంఘటన దృష్ట్యా పోలింగ్ సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు అధికారులు ప్రకటించారు. సంఘటన జరిగిన సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బూత్ లో అడుగు పెట్టిన తర్వాత అక్కడ ఉన్న ప్రిసైడింగ్ మరియు ఇతర సిబ్బంది లేచి నిలబడి అభివాదం చేశారు. ఇది వెబ్ క్యాస్టింగ్ కెమెరాల్లో కనిపించింది.

పిన్నెల్లి పగల కొడుతున్నా....
దీంతో పాటు వారు సంఘటన సమయం లో పిన్నెల్లి ఈవీఎంలను, వీవీ ప్యాట్ లను పగులకొడుతుతన్న దానిని వ్యతిరేకించక పోవడాన్ని ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుంది. దీంతో వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని ఎన్నికల కమిషన్ కోరింది. ఈ ఘటన పై ప్రిసెడింగ్ ఆఫీసర్ సరియైన సమాధానం ఇవ్వలేదని, సమాచారం కూడా ఇవ్వలేదని ఎన్నికల సంఘం తెలిపింది.


Tags:    

Similar News