ఈవీఎంల ధ్వంసంపై పిన్నెల్లిపై కేసు నమోదు

మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని ఈవీఎంలను ధ్వంసం చేయడాన్ని ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుంది

Update: 2024-05-22 01:45 GMT

మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని ఈవీఎంలను ధ్వంసం చేయడాన్ని ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుంది. పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను ధ్వంసం చేస్తూ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెబ్‌ కెమెరాలో రికార్డు అయ్యారు. ఈవీఎంల ధ్వంసం ఘటనకు సంబంధించి కేసు దర్యాప్తులో సహకరించేందుకు పల్నాడు జిల్లా ఎన్నికల అధికారులు అటువంటి అన్ని పోలింగ్ స్టేషన్ల వీడియో ఫుటేజీని పోలీసులకు అందజేశారు.

ఈసీ సీరియస్...
విచారణలో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఈసీ చాలా తీవ్రంగా పరిగణిస్తూ, ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి తెలియజేయాలని సీఈవో ముఖేష్ కుమార్ మీనా ను ఆదేశించింది. తద్వారా ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించే విషయంలో కఠినచర్యలు తీసుకోవాలని సూచించింది.


Tags:    

Similar News