నేడు ఉరవకొండకు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు

అనంతపురం జిల్లాలో నేడు భారత ఎన్నికల కమిషన్ అధికారులు పర్యటించనున్నారు.

Update: 2023-01-04 03:28 GMT

అనంతపురం జిల్లాలో నేడు భారత ఎన్నికల కమిషన్ అధికారులు పర్యటించనున్నారు. ప్రధానంగా ఉరవకొండ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపుపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు నేరుగా రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో విచారణకు భారత ఎన్నికల కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ పర్యటించనున్నారు. ఆయన విడపనకల్లు మండలం చీకలగురిలో పర్యటిస్తారని వెల్లడించారు.

పయ్యావుల ఫిర్యాదుతో...
ఫోర్జరీ నోటీసులు, టీడీపీ మద్దతుదారుల ఓట్ల తొలగింపుపై గతంలో అనేక సార్లు ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్ర ఎన్నికల అధికారులు విచారణకు రానున్నారు. ఇప్పటికే కొందరి అధికారులను ఈ కారణాలపై సస్పెండ్ చేశారు. వాలంటీర్ల సహకారంతో టీడీపీ ఓట్లను కావాలని తొలగిస్తున్నారని పయ్యావుల కేశవ్ చేసిన ఫిర్యాదుతో కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఈరోజు ఉరవకొండకు రానున్నారు.


Tags:    

Similar News