కొండపల్లి ఎన్నిక నిరవధిక వాయిదా.. ఎంపీ నాని బైఠాయింపు

కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నిరవధిక వాయిదా పడింది.

Update: 2021-11-23 07:25 GMT

కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నిరవధిక వాయిదా పడింది. కొండపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద వైసీపీ నేతలు పెద్దయెత్తున వచ్చి నినాదాలు చేస్తుండటంతో ఎన్నిక నిర్వహణ తమ కు సాధ్యం కావడం లేదని, అందుకే నిరవధికంగా ఎన్నికను వాయిదా వేస్తునట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. దీంతో విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని. టీడీపీ కౌన్సిలర్లు కొండపల్లి మున్సిపల్ కార్యాలయంలోనే బైఠాయించారు.

హైకోర్టుకు నాని...
కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను నిర్వహించాలంటూ ఇప్పటికే కేశినేని నాని హైకోర్టును ఆశ్రయించారు. మొత్తం 20 మంది వార్డులున్న కొండపల్లి మున్సిపాలిటీలో 15 స్థానాలను టీడీపీ, 14 స్థానాలను వైసీపీ గెలుచుకుంది. ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫిిషియో సభ్యుడిగా ఇక్కడ ఓటు వేయాలని భావిస్తున్నారు. కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను నిరవధికంగా వాయిదా వేసి, తమ నిర్ణయాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారికి తెలియజేయనున్నారు.


Tags:    

Similar News