అనంతపురం ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం?
అనంతపురం స్థానిక సంస్థల ఎమ్మెల్యే ఎన్నిక ఏకగ్రీవం అయింది. వైసీపీ అభ్యర్థి మంగమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయింది.
అనంతపురం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం అయింది. వైసీపీ అభ్యర్థి మంగమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయింది. అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రంగయ్య నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు. సరైన పత్రాలను సమర్పించకపోవడంతోనే నామినేషన్ ను తిరస్కరించామని అధికారులు చెబుతున్నారు.
తిరస్కరణకు గురి కావడంతో...
అయితే తన నామినేషన్ ను కావాలనే తిరస్కరించారని రంగయ్య ఆరోపిస్తున్నారు. దీనిపై తాను న్యాయపోరాటం చేస్తానని చెబుతున్నారు. అధికారులు పక్షపాతవైఖరిని అవలంబించారని, తాను కోర్టును ఆశ్రయించి తనకు న్యాయం జరిగే వరకూ పోరాడతానని తెలిపారు. అయితే అధికారులు ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.