కొండపల్లిలో టీడీపీదే విజయం
కొండపల్లిలో మున్సిపల్ ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్ ఎన్నిక ముగిసింది. టీడీపీకి పదహారు మంది ఓట్లు వేశారు.
కొండపల్లిలో మున్సిపల్ ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్ ఎన్నిక ముగిసింది. టీడీపీకి పదహారు మంది ఓట్లు వేశారు. టీడీపీ ఛైర్మన్ అభ్యర్థి చిట్టిబాబుకు మద్దతుగా 16 మంది టీడీపీ సభ్యులు ఓట్లు వేశారు. వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి జోగు రాముకు మద్దతుగా 15 ఓట్లు పడ్డాయి. విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానితో సహా పదిహేను మంది టీడీపీ కౌన్సిలర్లు ఓటు వేశారు. వైసీపీకి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో కలిపి పదిహేను ఓట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో టీడీపీ ఛైర్మన్, రెండు వైఎస్ ఛైర్మన్ ల పదవులను సులువుగా గెలుచుకుంది.
చేతులెత్తే పద్ధతిలో...
కొండపల్లిలో మొత్తం 20 వార్డులుండగా, వైసీపీ, టీడీపీ చెరి 14 డివిజన్లలో విజయం సాధించాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన శ్రీలక్ష్మి టీడీపీకి మద్దతిచ్చారు. ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫిషియో సభ్యుడిగా చేరడంతో టీడీపీ బలం 16కు చేరుకుంది. వైసీపీ పదిహేను మంది సభ్యులతోనే వెనకబడి ఉంది. హైకోర్టు సూచనల మేరకు చేతులెత్తే పద్ధతిలో అధికారులు ఎన్నికను నిర్వహించారు. వీడియోలను చిత్రీకరించారు. ఫలితాలను హైకోర్టుకు అధికారులు సీల్డ్ కవర్ లో నివేదించనున్నారు. కోర్టు తీర్పు తర్వాతే కొండపల్లి ఫలితం వెలువడుతుంది.