మరో ఎన్నికలకు తెలుగు రాష్ట్రాలు రెడీ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కు సంబంధించి పది ఎమ్మెల్సీ పోస్టులకు ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది.;

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కు సంబంధించి పది ఎమ్మెల్సీ పోస్టులకు ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. ఏపీలో ఐదు, తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 20న పోలింగ్ జరుగుతుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో కూటమి ప్రభుత్వమే ఐదు స్థానాలను కైవసం చేసుకోనుంది. యనమల రామకృష్ణుడు, పరుచూరి అశోక్ బాబు, తిరుమల నాయుడు, జంగా కృష్ణమూర్తి, రామారావు, మార్చి 3న నోటిఫికేషన్ విడుదలకానుంది.మార్చి 20వ తేదీన కౌంటింగ్ జరగనుంది.
తెలంగాణలో రిటైర్ అయ్యేది వీరే...
తెలంగాణలోనూ ఐదు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. శేరి సుభాష్ రెడ్డి,మల్లేశం, రియాజుల్ హుస్సేన్, మహమూద్ అలి,సత్యవతి పదవీవిరమణ చేయనున్నారు.వీరి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 13వ తేదీన గడువుగా నిర్ణయించారు. ఎమ్మెల్యే కోటా ఎన్నికలు కావడంతో రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీకి చెందిన వారే తిరిగి పెద్దల సభకు ఎన్నికయ్యే అవకాశముంది. దీనిపై త్వరలోనే పార్టీ అధినాయకత్వాలు అభ్యర్థులను ప్రకటించనున్నాయి.