రీ పోలింగ్ అవసరం లేదు : ముఖేష్ కుమార్ మీనా
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడా రీపోలింగ్ కు అధికారులు ఆదేశించలేదు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడా రీపోలింగ్ కు అధికారులు ఆదేశించలేదు. ఇది శుభపరిణామమే. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ అర్థరాత్రి పన్నెండు గంటల వరకూ సాగింది. అయితే పల్నాడు, అన్నమయ్య వంటి జిల్లాల్లో అక్కడక్కడ హింసాత్మక ఘటనలు జరిగినా పోలింగ్ కు ఎలాంటి అవరోధం ఏర్పడలేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. దీంతో ఏపీలో ఎక్కడా రీపోలింగ్ కు అవసరం లేదని ఆయన తెలిపారు.
ఫిర్యాదులు అందితే...
అయితే పోలింగ్ విషయంలో ఏ మాత్రం ఫిర్యాదులు అందినా వాటిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని, రీపోలింగ్ కు ఆదేశిస్తామని ఆయన తెలిపారు. పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ శాంతిభద్రతలకు ఇబ్బంది కలిగేలా సంఘటనలు ఏర్పడినా వెంటనే పోలీసులు వాటిని అదుపులోకి తెచ్చారన్నారు. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, యువత పెద్దయెత్తున ఓటింగ్ లో పాల్గొనడం మంచి పరిణామమని ఆయన తెలిపారు. ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.