పోరస్ కెమికల్ ఫ్యాక్టరీ మూసివేత

కంపెనీలో ప్రమాదకర రసాయనాలను వాడారా? పీడనం ఎక్కువవడం వల్లే కెమికల్ రియాక్షన్ జరిగి పేలుడు సంభవించిందా? అన్న దానిపై..

Update: 2022-04-14 09:09 GMT

ఏలూరు : అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగి ఆరుగురు మృతి చెందగా.. మరో 13 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఆ ఫ్యాక్టరీని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ ప్రకటించారు. ఫ్యాక్టరీ నిర్వహణ విశయంలో సంస్థ నిబంధనలను ఉల్లంఘించిందా ? లేదా? అన్న విషయంపై విచారణ చేస్తామని కలెక్టర్ తెలిపారు.

అలాగే కంపెనీలో ప్రమాదకర రసాయనాలను వాడారా? పీడనం ఎక్కువవడం వల్లే కెమికల్ రియాక్షన్ జరిగి పేలుడు సంభవించిందా? అన్న దానిపై కూడా ఆరా తీస్తున్నామని తెలిపారు. నిబంధలను ఉల్లంఘించినట్లు తేలితే కంపెనీని పూర్తిగా సీజ్ చేస్తామని కలెక్టర్ ప్రకటించారు. గాయపడిన బాధితుల చికిత్సకు సంస్థే వేతనం చెల్లిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు సంస్థ తరపున రూ.25 లక్షలు, ప్రభుత్వం తరపున మరో రూ.25 లక్షలు అందజేస్తామని కలెక్టర్ తెలిపారు.


Tags:    

Similar News