వచ్చే నెల 7 నుంచి సమ్మెలోకి?
పీఆర్సీపై ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెంటనే రద్దుచేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు మండి పడుతున్నాయి. పీఆర్సీపై ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెంటనే రద్దుచేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు అయితే ఏకంగా నేడు కలెక్టరేట్ లను రాష్ట్ర వ్యాప్తంగా ముట్టడించాయి. ఇప్పుడు ఉద్యోగ సంఘాలన్నీ ఏకమై కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ, సచివాలయ సంఘం ఉద్యోగులు అంతా ఒక్కటై మరికాసేపట్లో కార్యాచరణను ప్రకటించనున్నారు.
రేపు నోటీసులు...
రేపు ప్రభుత్వానికి సమ్మె నోటీసులు జారీ చేయనున్నారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రకటన మరికాసేపట్లో వెలువడనుంది. ప్రభుత్వానికి కనీసం పదిహేను రోజుల సమయం ఇచ్చి, తమ సమస్యలను పరిష్కరించకుంటే వచ్చే నెల 7వ తేదీ నుంచి సమ్మెలోకి వెళతామని నోటీసు ఇవ్వనున్నారు. చీఫ్ సెక్రటరీకి రేపు నోటీసు అందచేసే అవకాశముంది. పీఆర్సీ జీవో రద్దుతో పాటు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెలోకి వెళుతున్నారు.