జగన్ సర్కార్ కు ఉద్యోగ సంఘాల అల్టిమేటం
జగన్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చూపుతున్న వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేసేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి.
జగన్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చూపుతున్న వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేసేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి. పెండింగ్ బకాయీలతో పాటు, పీఆర్సీ నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశాయి. వచ్చే నెల 1వ తేదీన తాము సమ్మె నోటీసును చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మకు ఇవ్వనున్నట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ఈ మేరకు తమ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాయి. డిసెంబరు 7 నుంచి పదో తేదీ వరకూ నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతామన్నారు.
నిరసనలు ఇలా...
డిసెంబరు 10న నల్ల బ్యాడ్జీలతో లంచ్ అవర్ లో నిరసన ప్రదర్శన చేస్తామని చెప్పారు. డిసెంబరు 16న అన్ని తాలుకా, డివిజన్ కేంద్రాల్లో నిరసనల ర్యాలీలను నిర్వహిస్తామని చెప్పారు. డిసెంబరు 16న అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట ధర్నాలను చేస్తామన్నారు. డిసెంబరు 21వ తేదీన పెద్దయెత్తున ధర్నాలకు దిగుతామని చెప్పారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం దిగిరావాల్సిందేనని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి.