జగన్ సర్కార్ పై ఉద్యోగ సంఘాలు రివర్స్
పీఆర్సీని ప్రకటిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి
పీఆర్సీని ప్రకటిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఉద్యమానికి సిద్ధమయ్యాయి. ఎల్లుండి తమ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని స్పష్టం చేశాయి. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ కారణంగా ఉద్యోగుల జీతాల్లో భారీ కోత పడిందని ఆందోళన చెందాయి. ముఖ్యమంత్రి సమావేశంలోనూ కూడా తాము పీఆర్సీపై వ్యతిరేకించామని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు.
సమ్మెకు సిద్ధం.....
ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. హెచ్ఆర్ఏలో కూడా కోత విధించారని చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్దయగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. తమతో చర్చలు జరుపతామని చెప్పిన ప్రభుత్వం చర్చించకుండానే జీవోలను విడుదల చేసిందని చెప్పారు. అన్ని ఉద్యోగ సంఘాలు కలసి ఉద్యమ కార్యాచరణ ను సిద్ధం చేస్తున్నట్లు వారు తెలిపారు. కనీస చర్చలు జరపకుండా, సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెబుతూనే దుర్మార్గంగా జీవోలను విడుదల చేసిందని చెప్పారు. అవసరమైతే సమ్మెకు వెళతామని వారు స్పష్టం చేశారు.