ఏప్రిల్ వరకూ ఏపీలో కోతలు తప్పవు
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్తు ఇబ్బందులు తాత్కాలికమేనని ఇంధన కార్యదర్శి శ్రీధర్ తెలిపారు;
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్తు ఇబ్బందులు తాత్కాలికమేనని ఇంధన కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. ఏప్రిల్ నెలాఖరు వరకూ ఏపీలో విద్యుత్తు పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆయన చెప్పారు. దేశ వ్యాప్తంగా విద్యుత్తు రంగంలో పరిస్థిితి ఇలాగే ఉందని ఆయన తెలిపారు. ఈ ఇబ్బందులు తాత్కాలికంగా మాత్రమేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
డిమాండ్ పెరగడంతో....
ఆంధ్రప్రదేశ్ లో 180 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి జరుగుతుందని చెప్పారు. కానీ 230 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉందని తెలిపారు. పరిశ్రమలకు పవర్ హాలిడే ఇస్తే ఇరవై మిలియన్ల యూనిట్లు ఆదా అవుతుందని, తద్వారా గృహ, వ్యవసాయ రంగాలకు కోతలు ఉండకూడదనే పరిశ్రమలపై ఆంక్షలు విధించాల్సి వచ్చిందన్నారు. అధిక ధరకు బొగ్గును తెచ్చుకుంటూ విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించుకుంటున్నామని చెప్పారు.