Tirumala : మంగళవారమయినా తిరుమలలో రద్దీ తగ్గలేదే?
బ్రహ్మోత్సవాలు ముగిసినా తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది
బ్రహ్మోత్సవాలు ముగిసినా తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. గత తొమ్మిది రోజులుగా తిరుమలలో బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. ప్రధానంగా గరుడోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై మాడవీధుల్లో తిరిగే స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమలలో గతంలో శని, ఆదివారాలు మాత్రమే రద్దీ ఉండేది. కానీ ఇప్పుడు దసరా సెలవులు కొనసాగుతుండటంతో రద్దీ కూడా ఎక్కువగానే ఉందని అధికారులు చెబుతున్నారు.
మంగళవారమయినా...
నిన్న తిరుమల శ్రీవారిని 79,693 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. వీరిలో 21,864మంది తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.38 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. తిరుమలలో ఈరోజు భక్తుల రద్దీ అధికంగానే ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పది కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూలైన్‌లో టోకెన్లు లేకుండా వెళ్లే భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.